Maywati: ‘జమిలి’ని స్వాగతిస్తున్నాం.. బీఎస్పీ చీఫ్ మాయవతి

by vinod kumar |
Maywati: ‘జమిలి’ని స్వాగతిస్తున్నాం.. బీఎస్పీ చీఫ్ మాయవతి
X

దిశ, నేషనల్ బ్యూరో: వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One nation one election) ప్రతిపాదనకు బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (Bsp) చీఫ్ మాయవతి (Maywati) మద్దతు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ సరైందేనని చెప్పారు. జమిలీ వల్ల ఎలక్షన్ ఖర్చులు తగ్గడంతో పాటు ప్రజా అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా నిరంతరాయంగా కొనసాగేలా చేస్తుందని వెల్లడించారు. ఆదివారం ఆమె లక్నోలో మీడియాతో మాట్లాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు ఇతర పార్టీలు సైతం మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.

లోక్ సభలో రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న టైంలో కాంగ్రెస్, సమాజ్ వాదీ(sp) పార్టీలు దళిత, ఓబీసీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రిజర్వేషన్ అంశంపై నిరాధారమైన మాటలు మాట్లాడారని విమర్శించారు. వారి మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదన్నారు. బీజేపీ రిజర్వేషన్ వ్యతిరేక చర్యలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని, వారు ఇప్పుడు బిల్లులు ఆమోదించే పరిస్థితిలో లేరని మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటున్న తీర్మానాలు దేశ ప్రజలకు మేలు చేయడం లేదన్నారు. జమిలీని ఎన్నికల బిల్లును మాత్రమే బీఎస్పీ స్వాగతిస్తుందని నొక్కి చెప్పారు.

Advertisement

Next Story