అక్కడ మనసులు కలవవు.. చేతులే కలుస్తాయి : Mayawati

by Vinod kumar |   ( Updated:2023-06-22 11:35:35.0  )
అక్కడ మనసులు కలవవు.. చేతులే కలుస్తాయి : Mayawati
X

న్యూఢిల్లీ : బీహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మీటింగ్‌కు సరిగ్గా ఒకరోజు ముందు బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక ప్రకటన చేశారు. ఆ మీటింగ్‌కు వెళ్ళేది లేదని స్పష్టం చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ నిర్వహిస్తున్న ఆ సమావేశం మనసులు కలిపేలా లేదని.. కేవలం చేతులు కలిపేలా ఉందని వ్యాఖ్యానించారు. ఈమేరకు కామెంట్స్ తో ఆమె గురువారం వరుస ట్వీట్లు చేశారు. “కాంగ్రెస్, బీజేపీలు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని అమలు చేయలేకపోతున్నాయని దేశంలోని బహుజనుల స్థితిగతులను బట్టి స్పష్టమవుతోంది. అందుకే ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, జాతి విద్వేషం, మతపరమైన హింస వంటి వాటితో దేశం సతమతం అవుతోంది" అని మాయావతి పేర్కొన్నారు.

విపక్షాలు ఇలాంటి మీటింగ్స్ నిర్వహించుకునే ముందు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. పైకి ఒకరినొకరు పొగుడుకుంటూ.. మనసులో ఒకరిపై ఒకరు కుట్రలు పెట్టుకునే వైఖరితో విపక్షాల మధ్య ఐక్యత సాధ్యం కాదన్నారు. దేశంలోనే అత్యధికంగా 80 లోక్ సభ స్థానాలున్న యూపీ నుంచి తగిన సంఖ్యలో పార్టీలను, నాయకులను జూన్ 23 పాట్నా మీటింగ్‌కు పిలవకపోవడం తనను ఆందోళనకు గురి చేసిందన్నారు. ఉత్తర ప్రదేశ్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా విపక్ష కూటమితో సాధించేది ఏమీ ఉండదని చెప్పారు. విపక్షాల మీటింగ్‌కు ఆహ్వానం పొందని విపక్ష పార్టీల జాబితాలో బీఎస్పీ, బీజేడీ(నవీన్ పట్నాయక్‌), బీఆర్‌ఎస్ ఉన్నాయి.

Advertisement

Next Story