Mayawati: మహిళా భద్రతపై ప్రభుత్వాల నిర్లక్ష్యం.. బీఎస్పీ చీఫ్ మాయవతి

by vinod kumar |
Mayawati: మహిళా భద్రతపై ప్రభుత్వాల నిర్లక్ష్యం.. బీఎస్పీ చీఫ్ మాయవతి
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో మహిళా భద్రతపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయవతి ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఒడిశా, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా మహిళలపై పెరుగుతున్న నేరాల ఘటనలపై చర్యలు తీసుకోకుండా ఆరోపణలు, ప్రత్యారోపణలతో సంకుచిత రాజకీయాలకు పాల్పడడం చాలా బాధాకరమని తెలిపారు. మహిళల భద్రతపై ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొ్న్నారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మహిళలపై నేరాలు నిరంతరం పెరుగుతున్నాయని, వీటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం మానుకుని సీరియస్‌గా వ్యవహరించాలని సూచించారు. తద్వారా నేరాలను వీలైనంత వరకు నియంత్రించొచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా మహిళా భద్రతపై కఠిన చట్టాలు తీసుకురావాలని కోరారు.

Next Story