అక్క‌డ పెళ్లిచేసుకున్నోళ్ల‌కి బుల్డోజ‌ర్ గిఫ్ట్‌..! ఎందుకో తెలుసా?

by Sumithra |
అక్క‌డ పెళ్లిచేసుకున్నోళ్ల‌కి బుల్డోజ‌ర్ గిఫ్ట్‌..! ఎందుకో తెలుసా?
X

దిశ‌, వెబ్‌డెస్క్ః యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి బుల్‌డోజర్ ఒక గుర్తుగా మారింది. అవును, తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన సామూహిక వివాహ వేడుకలో జంటలకు బుల్‌డోజర్ బొమ్మలను బహుమతిగా అందజేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని కత్రాలో జరిగిన సామూహిక వివాహ వేడుకను చౌరాసియా కమ్యూనిటీ నిర్వహించింది. వివాహం చేసుకున్న తొమ్మిది జంటలకు బుల్‌డోజర్ బొమ్మతో పాటు గృహోపకరణాలు, ఇతర బహుమతులు కూడా అందించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా మేయర్ అభిలాషా గుప్తా మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలకు, అభివృద్ధికి బుల్‌డోజర్ బొమ్మ ఓ "భద్రతా చిహ్నం"గా మారిందని అన్నారు. ప్ర‌స్తుతం, 'బుల్‌డోజర్ బాబా'గా పిలుచుకునే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వధువులు సమిష్టిగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి, స్వామి కళ్యాణి నంద్ గిరి అకా ఛోటీ గురు మాట్లాడుతూ, బుల్డోజర్ బొమ్మలు చెడుపై మంచి విజయాన్ని, జీవితంలో క్రమాన్ని కూడా సూచిస్తాయని, ఇదే మేము దంపతులకు ఇవ్వాలనుకుంటున్న సందేశమ‌ని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేస్తున్న మంచి పనికి ఇది ఆమోదం' అని స్వామిణి పేర్కొన్నారు. పెళ్లిళ్లకే కాదు, బర్త్ డే పార్టీల్లోనూ బుల్డోజర్లు ఇస్తుండ‌టం గ‌మ‌నార్హం. యోగి ఆదిత్యనాథ్ తన మొదటి టర్మ్‌లో మాఫియా, నేరస్థులు అక్రమంగా సంపాదించిన ఆస్తులను కూల్చివేయడానికి బుల్‌డోజర్‌ను విస్తృతంగా ఉపయోగించారు. రాష్ట్రంలో కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను బుల్‌డోజర్‌తో కొల్లగొట్టారు.

Advertisement

Next Story

Most Viewed