ప్రియాంక గాంధీ పర్యటన వేళ బస్తర్‌లో మావోయిస్టుల హల్‌చల్

by GSrikanth |   ( Updated:2023-04-13 10:46:26.0  )
ప్రియాంక గాంధీ పర్యటన వేళ బస్తర్‌లో మావోయిస్టుల హల్‌చల్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఓ వైపు బస్తర్‌లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటన జరుగుతుండగా.. మరోవైపు మావోయిస్టులు హల్ చల్ చేశారు. బీజాపూర్ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పదేడా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన పార్క్ చేసిన రెండు టిప్పర్లను దహనం చేశారు. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మన్యంలో కూంబింగ్ సైతం ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed