- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియాకు మరో షాక్.. జూన్ 2 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా సీబీఐ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జూన్ 2 వరకు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈడీ విచారిస్తున్న ఎక్సైజ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సిసోడియాను అధికారులు ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు ఎదుట హాజరుపరిచే సందర్భంలో తన న్యాయవాది ఇర్షాద్ ఖాన్‌తో సమావేశానికి సిసోడియాకు అనుమతి లభించింది.
విచారణ అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సిసోడియా స్పందిస్తూ ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని అవమానపరిచారని విమర్శించారు. ప్రధాని రాజ్యాంగాన్ని అనుసరించాలని సూచించారు. ఈ సందర్భంగా అమ్దన్‌దీప్ దాల్ జ్యుడిషియల్ కస్టడీని కూడా కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read.
విపక్ష కూటమికి ఆయన నాయకత్వం వహిస్తే ఓకే.. బిహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు