మరి కాసేపట్లో కోర్టుకు మనీష్ సిసోడియా

by samatah |
మరి కాసేపట్లో కోర్టుకు మనీష్ సిసోడియా
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆప్ నేత మనీష్ సిసోడియాను మరికాసేపట్లో ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. సీబీఐ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న సిసోడియా నిన్న సాయంత్రం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి కోరే అవకాశం ఉంది. అరెస్టుకు ముందు మూడు రోజుల పాటు జైలులో విచారించిన ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంపై మరింత ఆరా తీయబోతున్నారు. ఈ మేరకు కస్టడీని కోరే అవకాశం ఉంది. మరో వైపు సీబీఐ కేసులో సిసోడియా ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. కవితను ప్రశ్నించేందుకు ముందు సిసోడియాను ఈడీ అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ కేసు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Advertisement

Next Story