'అసమర్థ సీఎంను బర్తరఫ్‌ చేయండి'.. మణిపూర్ ముఖ్యమంత్రిపై ఖర్గే ఫైర్

by Vinod kumar |
అసమర్థ సీఎంను బర్తరఫ్‌ చేయండి.. మణిపూర్ ముఖ్యమంత్రిపై ఖర్గే ఫైర్
X

ఇంఫాల్ : అసమర్థ మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్‌ను బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. 147 రోజులుగా మణిపూర్ ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నా.. ఆ రాష్ట్రాన్ని సందర్శించే టైం ప్రధానమంత్రికి దొరకడం లేదని మండిపడ్డారు. జులై 6న తప్పిపోయిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైన ఘటన మరోసారి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.

ఈమేరకు మల్లికార్జున ఖర్గే బుధవారం ఓ ట్వీట్ చేశారు. మణిపూర్ లోని సాయుధ తీవ్రవాదులు మహిళలు, చిన్నారులను లక్ష్యంగా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాన్ని బీజేపీ రణరంగంగా మారుస్తోందని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed