తెలుగు టైటిల్ పెట్టక పోవడంపై 'వెట్టయాన్' చిత్ర బృందం క్లారిటీ

by M.Rajitha |   ( Updated:2024-10-09 13:12:34.0  )
తెలుగు టైటిల్ పెట్టక పోవడంపై వెట్టయాన్ చిత్ర బృందం క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : రజినీకాంత్ హీరోగా దర్శకుడు వస్తున్న తాజా చిత్రం 'వెట్టయాన్'. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రానికి తెలుగు టైటిల్ పెట్టకపోవడంపై టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది. తెలుగు అంటే అంటే ఇంత చిన్న చూపు ఎందుకని పలువురు తెలుగు సినీ ప్రముఖులు విమర్శలు చేస్తున్నారని కూడా తెలుస్తోంది. ఈ వివాదంపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. 'వెట్టయాన్' చిత్రానికి తెలుగు టైటిల్ 'వేటగాడు'గా రిజిస్టర్ చేయాలనుకున్నామని, కాని అది అందుబాటులో లేకపోవడంతో తమిళ్ ఒరిజినల్ పేరుతోనే రిలీజ్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది. తమకు తెలుగు భాషపై ఎలాంటి చిన్నచూపు లేదని పేర్కొన్న సంస్థ.. ఎప్పటిలాగే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. కాగా ఈ చిత్రం ఈనెల 10న విడుదల కానుంది.

Advertisement

Next Story