పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు : తాండూర్ ఎమ్మెల్యే

by Aamani |
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు  ప్రభుత్వం చర్యలు : తాండూర్ ఎమ్మెల్యే
X

దిశ,తాండూరు : ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. వివిధ సమస్యలతో బాధపడుతూ పలు ఆసుపత్రులలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న 54 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని రకాల వైద్య సేవలో పేదలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని చెప్పారు. అంతే కాకుండా కార్మికులు అత్యధికంగా ఉన్న తాండూరు మండలం, తాండూరు పట్టణం, బషీరాబాద్ మండలాలకు చెందిన 54 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 18లక్షల 40 వేల చెక్కులను అందించమన్నారు.

తాండూర్ నియోజకవర్గ పరిధిలోని సిమెంట్, సుద్ధ,నాపరాతి గనులలో పనిచేసే కార్మికులు మున్సిపల్, గ్రామ పంచాయతీ, వ్యాపార సంస్థల్లో పనిచేసే కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని ఉద్దేశంతో ఈఎస్ఐ హాస్పిటల్ ను అతిత్వరలో అందుబాటులోకి తెస్తూ పాత మున్సిపల్ కార్యాలయంలో ఆస్పత్రి సేవలు కొనసాగుతాయని చెప్పారు. ఏ ఒక్కరు కూడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజా పాలనలో ప్రజా ఆరోగ్యం పై కూడా ప్రభుత్వమే అండగా ఉంటుందన్నారు.ఆరోగ్య శ్రీ పరిధిలోనికి రాని వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమిళ్ళ, రంగారెడ్డి డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్,అజయ్ ప్రసాద్,బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి,మాణిక్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story