మణిపూర్‌లోకి చొరబడిన మయన్మార్ వాసులను ఏం చేశారంటే ?

by Hajipasha |
మణిపూర్‌లోకి  చొరబడిన మయన్మార్ వాసులను ఏం చేశారంటే ?
X

దిశ, నేషనల్ బ్యూరో : మయన్మార్‌‌లోని సైనిక ప్రభుత్వంపై ప్రజా సంఘాల తిరుగుబాటు నేపథ్యంలో ఆ దేశంలోని సరిహద్దు ప్రాంతాల నుంచి ఎంతోమంది అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని భారత్‌లోని మణిపూర్‌లోకి ప్రవేశించారు. వారంతా దాదాపు గత రెండు నెలలుగా మణిపూర్‌లోని పునరావాస క్యాంపులలో తలదాచుకుంటున్నారు. ఆపద కాలంలో పొట్ట చేత పట్టుకొని సరిహద్దు దాటి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన వందలాది మంది మయన్మార్ వాసులపై భారత్ కరుణ చూపింది. వారికి తగిన వైద్య సాయాన్ని అందించడంతో పాటు ఆహార సౌకర్యాన్ని కూడా కల్పించింది. ఈవిధంగా మనదేశంలోకి ఎంటరైన మయన్మార్‌ వాసులలో పలువురిని శుక్రవారం భారత్ వెనక్కి పంపించింది. ఎంతమందిని వెనక్కి పంపారనేది తెలియరాలేదు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో మయన్మార్‌కు చెందిన మహిళలు, పిల్లలను పెద్దసంఖ్యలో ఆ దేశానికి తరలించారు. ఇంఫాల్ ఎయిర్‌పోర్టు వద్దనున్న పరిస్థితిని అద్దంపట్టే ఒక వీడియోను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ చేశారు. 1951సంవత్సరం నాటి శరణార్థుల ఒప్పందంపై భారత్ సంతకం చేయనప్పటికీ.. దేశంలోకి వచ్చిన మయన్మార్ వాసులతో మానవతా ప్రాతిపదికనే నడుచుకుంటోందని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed