- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
UPలో దారుణం: మేక పొలంలోకి వచ్చిందని 60 ఏళ్ల దళిత మహిళను తీవ్రంగా కొట్టిన వ్యక్తి
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మేక తన పొలంలోకి వచ్చిందని ఒక వ్యక్తి, దళిత మహిళను దారుణంగా కొట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే, బులంద్‌షహర్‌లో 60 సంవత్సరాల వయసు కలిగిన దళిత మహిళకు చెందిన మేక పొరపాటున ఒక వ్యక్తి పొలం లోకి వెళ్లింది, దీంతో ఆ పొలం యజమాని వయసు పైబడిన మహిళ అని చూడకుండా కులం పేరుతో తిడుతూ నిస్సహాయంగా ఉన్న దళిత మహిళపై కర్రతో తీవ్రంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులు దీనిపై పూర్తి దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ ఘటన పోలీసుల వరకు చేరడంతో అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. భారత్‌లో దళితులపై ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోతున్నాయి, వారు ఎదుర్కొంటున్న వివక్ష, హింసను ఈ సంఘటన మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఇంతకుముందు ఫిబ్రవరిలో, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన వివాహ ఊరేగింపులో భాగంగా గుర్రంపై స్వారీ చేసినందుకు దళిత పెళ్ళికొడుకుపై దాడి జరిగింది. గుర్రపు స్వారీ చేస్తూ ఊరేగింపుగా వధువు ఇంటికి వెళుతుండగా బైక్‌పై వచ్చిన వ్యక్తి అతన్ని అడ్డుకుని గుర్రం నుండి క్రిందికి లాగి చెంప దెబ్బ కొట్టి, తన వర్గానికి చెందిన వారు మాత్రమే గుర్రపు స్వారీ చేయాలని అన్నాడు, అలాగే ఆ వరుడిని కులం పేరుతో దూషించాడు.