Mamata Banerjee: మమతా ఆరోపణలను ఖండించిన కేంద్రం.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ

by Prasad Jukanti |
Mamata Banerjee: మమతా ఆరోపణలను ఖండించిన కేంద్రం.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 9వ గవర్నర్ కౌన్సిల్ సమావేశంలో తాను మాట్లాడుతుండగానే తన మైక్ కట్ చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కేంద్రం ఖండించింది. మమతా బెనర్జీ వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ పీఐబీ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. అక్కడ ఉన్న క్లాక్ మమతా బెనర్జీ సమయం ముగిసిందని మాత్రమే చూపిందని దానికి గుర్తుగా బెల్ కూడా ఇంకా మోగనేలేదని తెలిపింది. తాను మాట్లాడుతుండగానే మైక్ కట్ చేశారని చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొంది. కాగా నీతి ఆయోగ్ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చిన మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. తమ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో తాను మాట్లాడుతుండగానే నా మైక్ ఆపేశారని నేను మాట్లాడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ చర్య ప్రాంతీయ పార్టీలను అవమానించడమే అని భవిష్యత్తులో ఇంకెప్పుడూ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానని తెలిపారు. ఈ వ్యవహారం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా మమతా బెనర్జీ వాకౌట్ పై బీజేపీ సైతం స్పందించింది. విపక్షాలకు చెందిన కొందరు బాయ్ కాట్ చేసేందుకు నీతి ఆయోగ్ ను ఒక వేదికగా మార్చుకున్నారని ధ్వజమెత్తింది.

Advertisement

Next Story