Kolkata doctor's murder: పీజీ వైద్యవిద్యార్థిని దారుణ హత్య

by Shamantha N |
Kolkata doctors murder: పీజీ వైద్యవిద్యార్థిని దారుణ హత్య
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో దారుణ ఘటన జరిగింది. ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి, ఆతర్వాత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ రాయ్ అనే తాత్కాలిక ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేశారు. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో అత్యాచరం జరిగినట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు. మృతురాలి కళ్లు, నోటి నుంచి రక్తం కారిందని.. ఆమె కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులపై గాయాలున్నాయని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల ప్రాంతంలో హత్య జరిగినట్లు వెల్లడించారు.

స్పందించిన మమతా బెనర్జీ

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ ఘటనపై స్పందించారు. అవసరమైతే నిందితులను ఉరితీస్తామని.. కఠిన శిక్ష పడేలా చేస్తామని అన్నారు. కేసును వేగంగా ఛేదించాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని.. అరెస్టయిన నిందితులు బాధితురాలి కుటుంబసభ్యులతో మాట్లాడి.. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైద్యుల డిమాండ్లను సమర్థించిన దీదీ.. వారికి మద్దతు తెలిపారు. ఈ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి తరలించినట్లు పేర్కొన్నారు. బెంగాల్ ప్రభుత్వంపై విద్యార్థులకు నమ్మకం లేకపోతే, మరేదైనా సంస్థను సంప్రదించవచ్చని అన్నారు. సరైన, సమగ్ర విచారణ చేపడతామన్నారు. తమ నిరసనను కొనసాగిస్తూనే రోగులకు చికిత్స చేయాలని దీదీ వైద్యులను కోరారు. ఈ కేసు విచారణకు సం బంధించిపోలీసులతో టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. మరోవైపు, బీజేపీ నేతలు బెంగాల్ ప్రభుత్వం తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు క్యాండిల్‌ మార్చ్‌, నిరసనలు చేపట్టారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed