భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి

by S Gopi |
భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, మాల్దీవుల మధ్య దౌత్య పరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత పర్యటనకు రానున్నారు. చైనాకు అనుకూలంగా మాల్దీవుల అధ్యక్షుడు మయిజూ అధికారం చేపట్టిన తర్వాత ఆ దేశం నుంచి భారత్‌కు ఓ ఉన్నతస్థాయి అధికారిక పర్యటన ఖరారు కావడం ఇదే మొదటిసారి. మాల్దీవుల అధ్యక్షుడిగా మయిజు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. భారత్‌పై పలువురు మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో దౌత్యపరమైన సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ కారణంగా తాజా పార్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మాల్దీవుల నుంచి భారత బలగాలను వెనక్కి తీసుకోవాలని మయిజూ కోరారు. దానికి మే 10న గడువు కూడా విధించారు. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య సమావేశం జరుగుతుండటం గమనార్హం. ఇప్పటికే మాల్దీవుల సైనికుల్లో చాలామందిని భారత్ వెనక్కి రప్పించింది. గురువారం జరిగే భేటిలో ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి, ప్రాంతీయ అంశాల గురించి చర్చ ఉండనుంది.

Advertisement

Next Story

Most Viewed