మాల్దీవులు టూరిజం ర్యాంకింగ్స్: ఐదో స్థానానికి పడిపోయిన భారత్

by samatah |
మాల్దీవులు టూరిజం ర్యాంకింగ్స్: ఐదో స్థానానికి పడిపోయిన భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్య వివాదం కారణంగా మాల్దీవులు టూరిజం ర్యాంకింగ్స్‌లో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. మాల్దీవులు పర్యాటక శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం..డిసెంబర్ 2023లో అగ్రస్థానంలో ఉన్న భారత్ తాజాగా ఐదో స్థానానికి దిగజారింది. 2024 జనవరి 28 నాటికి మాల్దీవులు టూరిజంతో భారత్ వాటా 8 శాతం ఉండగా చైనా 9.5శాతం, యూకే 8.1శాతం వాటా కలిగి ఉన్నాయి. మొత్తం 13,989 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. జనవరి 2024లో అత్యధిక మంది పర్యాటకులను మాల్దీవులకు పంపిన దేశాల్లో రష్యా (18,561), ఇటలీ (18,111), చైనా (16,529) , యూకే (14,588) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కేవలం ఒక నెలలోనే మాల్దీవుల టూరిజం మార్కెట్‌లో భారత్ స్థానం గణనీయంగా పడిపోడం గమనార్హం. కాగా, ప్రధాన మంత్రి లక్షద్వీప్ పర్యటన నేపథ్యంలో ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే.

మాల్దీవుల్లో భారత్ vs చైనా టూరిజం

బీచ్‌లు, లగ్జరీ టూరిజానికి ప్రసిద్ధి చెందిన మాల్దీవులకు 2023లో అతిపెద్ద టూరిజం మార్కెట్‌గా భారత్ ఉంది. 2020కి ముందు చైనా అగ్రస్థానంలో ఉండేది. 2020 తర్వాత భారత్ నుంచి మాల్దీవులు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన పరిణామాల వల్ల భారత్ ఐడో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఇటీవల మాల్దీవులు అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ ముయిజ్జు చైనా అనుకూల నేతగా పరిగణించసడటంతో చైనీయులు మాల్దీవులు పర్యటనకు అత్యధికంగా వెళ్తుండటం గమనార్హం.

Advertisement

Next Story