మోడీపై మాల్దీవులు మంత్రుల కామెంట్స్: స్పందించిన ‘మాటి’

by samatah |
మోడీపై మాల్దీవులు మంత్రుల కామెంట్స్: స్పందించిన ‘మాటి’
X

దిశ, నేషనల్ బ్యూరో: లక్షద్వీప్ పర్యటన నేపథ్యంలో మాల్దీవులు మంత్రులు మోడీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ పర్యాటక సంఘం మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ(మాటి) స్పందించింది. సోషల్ మీడియాలో మోడీపై చేసిన కామెంట్స్‌ను ఖండిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘భారత్ మాకు అత్యంత మిత్ర దేశం. మా దేశంలో వివిధ సంక్షోభాలు ఎదురైనప్పుడు భారత్ అండగా నిలిచింది. ప్రభుత్వం, దేశ ప్రజలు మాతో కొనసాగించిన సన్నిహిత సంబంధానికి కృతజ్ఞతలు’ అని పేర్కొంది. మాల్దీవుల పర్యాటక పరిశ్రమకు భారతదేశం స్థిరమైన, గణనీయమైన సహకారాన్ని అందిస్తోందని తెలిపింది. కొవిడ్ సమయంలోనూ భారత్ ఎంతో సహాయం చేసిందని ప్రశంసించింది. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు అనేక తరాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించింది. రెండు దేశాల మధ్య ప్రతికూల ప్రభావం చూపే చర్యలకు దూరంగా ఉంటామని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed