Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే అంశాలు

by Shamantha N |
Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే అంశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో(Maharashtra) ఎన్సీపీ(అజిత్‌ పవార్‌ వర్గం)నేత బాబా సిద్ధిఖీ(Baba Siddique) హత్య కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. వీలైతే బాబా సిద్ధిఖీ.. లేకుంటే జిషాన్ సిద్ధిఖీని కాల్చివేయమని అన్మోల్ బిష్ణోయ్ తమకు ఆదేశించాడని ప్రధాన నిందితుడు శివకుమార్‌ చెప్పినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ‘ముందు ఎవరిని చూసినా కాల్చేయండి’ అని అన్మోల్ శివకుమార్‌తో చెప్పాడని తెలిపారు. ‘దేవుడు, సమాజం’ కోసం తాను ఏం చేయబోతున్నానో.. అన్మోల్ తనతో అన్నాడని శివకుమార్‌ చెప్పినట్లు ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపాయి. అయితే.. సిద్ధిఖీని కాల్చిచంపిన ముగ్గురిలో ఒకరి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లో జిషాన్ సిద్ధిఖీ ఫొటో కనిపించిందని పోలీసులు పేర్కొన్నారు. బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ప్రధాన నిందితుడు శివ కుమార్ గౌతమ్ వెంటనే బట్టలు మార్చుకొని అదృశ్యం అయ్యాడని. అతన్ని ఎవరూ గుర్తించలేదని తెలిపారు. ఘటనాస్థలి నుంచి కుర్లాకు ఆటోలో ప్రయాణించి.. అక్కడి నుంచి థానేకు లోకల్ రైలు ఎక్కినట్లు పేర్కొన్నారు. థానే నుంచి రైలులో పూణేకు వెళ్లే సమయంలో తన మొబైల్ ఫోన్‌ను పారేశాడని చెప్పారు. ‘శివ కుమార్ సుమారు ఏడు రోజుల పాటు పూణేలో ఉండి, అక్కడ్నుంచి రైలులో ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి వెళ్లాడు. ఆ తర్వాత ఐదు రోజుల పాటు అక్కడే ఉండి లక్నో చేరుకున్నాడు. లక్నోలో కొత్త మొబైల్ కొని తన సహాయకులను సంప్రదించాడు. అక్కడ 11 రోజులు ఉన్న తర్వాత, అతను తన స్వస్థలమైన బహ్రెయిచ్‌కు వెళ్లి తన సహాయకులతో భేటీ అయ్యాడు. దీంతో వారు సమీపంలోని గ్రామంలో అతనికి భద్రత కల్పించారు’ అని పోలీసులు వెల్లడించారు. ఇక.. దేశం వీడి పారిపోయే ముందు అతను మొదట మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని వెళ్లి, ఆపై జమ్మూలోని వైష్ణో దేవికి వెళ్లాలని ప్లాన్ చేసినట్లు శివ కుమార్ పోలీసులకు తెలిపాడు.

బాబాసిద్ధిఖీ హత్య కేసు

ఇకపోతే, బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్ ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నించిన శివకుమార్‌ను, అతడి నలుగురు సహాయకులను బహ్రెయిచ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అక్టోబరు 12న ముంబైలో సిద్ధిఖీని కాల్చిచంపిన ముగ్గురు షూటర్లలో శివకుమార్‌ కూడా ఉన్నాడు. అయితే.. హర్యానా నివాసి గుర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్‌లను పోలీసులు అరెస్టు చేయగా.. శివ కుమార్ పరారయ్యాడు.

Advertisement

Next Story