Mahua Moitra : దేవుళ్లను ఆపేవాళ్లు ఉంటారా ?.. వీహెచ్‌పీ కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ జడ్జీపై ఎంపీ మహువా విమర్శలు

by Hajipasha |
Mahua Moitra : దేవుళ్లను ఆపేవాళ్లు ఉంటారా ?.. వీహెచ్‌పీ కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్  జడ్జీపై ఎంపీ మహువా విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో : తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ‘సిటిజెన్స్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొన్న ఓ రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఉద్దేశించి ఆమె ఎక్స్ వేదికగా పరోక్ష విమర్శలు గుప్పించారు. ‘‘నేను జడ్జీగా రిటైరయ్యాను. దేశంలోని ఇతర పౌరుల్లాగే నాకూ ఆసక్తి ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనే స్వేచ్ఛ ఉంది. సమకాలీన అంశాలపై చర్చించే హక్కు నాకు సైతం ఉంది’’ అని సదరు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై మహువా స్పందించారు.

‘‘అవును మైలార్డ్స్.. మీకు ఆ స్వేచ్ఛ ఉంది. మీరు ఏ కార్యక్రమానికైనా హాజరుకావొచ్చు. రిటైర్మెంట్ తర్వాతి ప్రయోజనాలు కూడా పొందొచ్చు. రాజ్యసభ సభ్యులుగా సైతం నామినేట్ కావొచ్చు. దేవుళ్లు ఏదైనా చేయదల్చుకుంటే ఆపేవాళ్లు ఉంటారా ? మేం తుచ్ఛమైన మానవులం. మిమ్మల్ని ప్రశ్నించే అంతటి వాళ్లమా ?’’ అంటూ మహువా మొయిత్రా వ్యంగ్యంగా ప్రశ్నలు సంధించారు.

Advertisement

Next Story