- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన రైనా
దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్లు ఎం.ఎస్ ధోనీ, సురేశ్ రైనాల మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమిండియాతోపాటు చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు వీరిద్దరూ చాలా కాలంపాటు ఆడారు. సీఎస్కే ఫ్యాన్స్ ధోనీని ‘తలా’ అని పిలిస్తే.. రైనాను ‘చిన్న తలా’ అని పిలుస్తుంటారు. అయితే, ధోనీ వచ్చే సీజన్ ఐపీఎల్ ఆడతాడా?లేదా? అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. తాజాగా ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై రైనా ఆసక్తికకర వ్యాఖ్యలు చేశాడు.
ఢిల్లీలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న అతన్ని.. ధోనీని లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్‌సీసీ)లో చూడాలనుకుంటున్నారా? అని అడిగారు. దీనికి రైనా సమాధానమిస్తూ..‘నిజాయతీగా చెప్పాలంటే ధోనీ ఎల్‌సీసీ ఆడితే నేను చాలా ఇష్టపడతా. ఐపీఎల్ వేలం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ధోనీ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఐపీఎల్ ఆడతాడో తెలియదు. ఆ విషయాన్ని ఎల్‌సీసీ యజమానులనే ఆడగాలి. వారు అతనితో మాట్లాడుతూ ఉండొచ్చు.’ అని చెప్పాడు. కాగా, ఈ నెల 20 నుంచి ఎల్‌సీసీ మూడో ఎడిషన్ ప్రారంభంకానుంది. టోర్నీలో అర్బనైజర్స్ హైదరాబాద్‌కు రైనా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.