Fiscal Deficit: ఆగష్టులో పెరిగిన వాణిజ్య లోటు

by S Gopi |   ( Updated:2024-09-17 16:27:49.0  )
Fiscal Deficit: ఆగష్టులో పెరిగిన వాణిజ్య లోటు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఎగుమతులు ఆగష్టు నెలలో క్షీణించాయి. సరుకులు, సేవలు కలిపి గత నెలలో మొత్తం 65.4 బిలియన్ డాలర్ల(రూ. 5.48 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. ఇది వార్షిక ప్రాతిపదికన 2.4 శాతం తగ్గింది. గతేడాది ఇదే నెలలో ఎగుమతులు రూ. 5.62 లక్షల కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు మంగళవారం ప్రకటనలో వెల్లడించాయి. మొత్తం ఎగుమతుల్లో సరుకుల ఎగుమతులు 38.28 బిలియన్ డాలర్ల(రూ. 3.20 లక్షల కోట్ల) నుంచి 34.71 బిలియన్ డాలర్ల(రూ. 2.90 లక్షల కోట్ల)కు పడిపోయాయి. సేవల ఎగుమతులు 28.71 బిలియన్ డాలర్ల(రూ. 2.40 లక్షల కోట్ల) నుంచి 30.69 బిలియన్ డాలర్ల(రూ. 2.57 లక్షల కోట్ల)కు పెరిగాయి. ఇదే నెలలో దిగుమతులు సరుకులు, సేవలూ రెండూ కలిపి 77.39 బిలియన్ డాలర్ల(రూ. 6.48 లక్షల కోట్ల) నుంచి 80.06 బిలియన్ డాలర్ల(రూ. 6.7 లక్షల కోట్ల)కు పెరిగాయి. ఇది 3.45 శాతం పెరుగుదల. ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో వాణిజ్య లోటు 29.65 బిలియన్‌ డాలర్ల(రూ. 2.48 లక్షల కోట్ల)కు పెరిగింది.

Advertisement

Next Story