ఆర్టీసీ డ్రైవర్ ఆటో డ్రైవర్ మధ్య ఘర్షణ..

by Aamani |
ఆర్టీసీ డ్రైవర్ ఆటో డ్రైవర్ మధ్య  ఘర్షణ..
X

దిశ, హత్నూర: ఒంటిపై డీజిల్ పోసుకొని నింపండించుకుని ఆత్మహత్యాయత్నానికి ఆటో డ్రైవర్ పాల్పడి ఘటన హత్నూర పోలీస్ స్టేషన్ లో ఆవరణలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. హత్నూర మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన పటేల్ విట్టల్ గౌడ్ ఆటో డ్రైవర్ దౌల్తాబాద్ నుండి ఆటో మల్కాపూర్ వెళ్తుండగా వెనుక నుంచి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో కు చెందిన బస్సు వస్తున్న క్రమంలో ఆటో డ్రైవర్ సైడ్ ఇవ్వడం లేదని ఆర్టీసీ డ్రైవర్ అనిల్ ఆటో డ్రైవర్ విట్టల్ గౌడ్ మధ్య ఘర్ష మల్కాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. రోడ్డుపై ఆర్టీసీ బస్సు, ఆటో నిలిపివేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి .ఇద్దరు డ్రైవర్ల మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరిపోయిందని చేరుకుంది. ఆర్టీసీ డ్రైవర్ అనిల్ వెంటనే 100 నెంబర్ కు డయల్ చేయడంతో స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇద్దరి డ్రైవర్ల తో పాటు ఆర్టీసీ బస్సు ఆటోను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

ఆర్టీసీ డ్రైవర్ అనిల్ తనపై ఆటో డ్రైవర్ దాడి చేశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న ఆటోడ్రైవర్ విట్టల్ గౌడ్ ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న డీజిల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. వెంటనే మంటలను గమనించిన పోలీసులు అప్రమత్తమై ఆటో డ్రైవర్ విటల్ గౌడ్ ఒంటిపై నీళ్లు చల్లి మంటలను ఆర్పేశారు. వెంటనే గాయాలైన డ్రైవర్ ను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో విచారణ చేస్తున్నట్లు ఎస్సై సుభాష్ తెలిపారు. ఆటో డ్రైవర్ ను ఎవరు తిట్టలేదని బెదిరించలేదని ఎస్ఐ పేర్కొన్నారు.

పోలీసులు బెదిరించారు..

తన సెల్ ఫోన్ గుంజుకొని భయభ్రాంతులకు గురిచేసి పోలీసులు తిట్టడం వల్లనే భయానికి గురై ఒంటిపై డిజిల్ పోసుకొని నింపండించుకున్నానని ఆటో డ్రైవర్ విట్టల్ గౌడ్ తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ కేసు పెడితే జైలుకు వెళ్తావ్ అంటూ బెదిరించారని ఏం చేయాలో తోచని పరిస్థితిలో పోలీస్ స్టేషన్ లోనే నిప్పంటించుకున్నానని బాధితుడు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed