Mahayuti: మహారాష్ట్రలో మహాయుతిదే అధికారం.. మరో ఎగ్జిట్ పోల్ అంచనా!

by vinod kumar |
Mahayuti: మహారాష్ట్రలో మహాయుతిదే అధికారం.. మరో ఎగ్జిట్ పోల్ అంచనా!
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి (Mahayuthi Alliance) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అనేక ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా యాక్సిస్ మై ఇండియా (Axis my india) సైతం మహాయుతి కూటమిదే విజయమని అంచనా వేసింది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను అధికార కూటమి 178-200 సీట్లు గెలుచుకునే చాన్స్ ఉందని తెలిపింది. శివసేన (UBT), కాంగ్రెస్, ఎన్సీపీ (Sp)లతో కూడిన మహా వికాస్ అఘాడీ(MVA) కూటమికి 82 నుంచి 102 సీట్లు రావొచ్చని వెల్లడించింది. అధికార కూటమికి 48 శాతం ఓట్లు రాగా, ప్రతిపక్ష కూటమికి 37 శాతం ఓట్లు రావొచ్చని పేర్కొంది. ముంబై ప్రాంతంలోని 36 సీట్లలో మహాయుతి కూటమి 45 శాతం ఓట్ షేర్‌తో 22 స్థానాలను గెలుచుకోవచ్చని తెలిపింది. మరో 14 స్థానాలను ఎంవీఏ కైవసం చేసుకోనున్నట్టు పేర్కొంది. విదర్భ ప్రాంతంలో మహాయుతి 62 సీట్లలో 39, ఎంవీఏ 20 సీట్లలో విజయం సాధిస్తాయని తెలిపింది. కొంకణ్, థానే ప్రాంతాల్లోనూ మహాయుతి కూటమే అధిక్యాన్ని కనబరిచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తర మహారాష్ట్ర ప్రాంతంలోనూ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపింది. కాగా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed