Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల్లో విషాదం.. గుండెపోటుతో ఇండిపెండెంట్ అభ్యర్థి మృతి

by vinod kumar |
Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల్లో విషాదం.. గుండెపోటుతో ఇండిపెండెంట్ అభ్యర్థి మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని బీడ్ (Beed) నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలాసాహెబ్ షిండే (Balasaheb shinde) గుండెపోటుతో మరణించారు. బీడ్ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచిన బాలాసాహెబ్ ఛత్రపతి షాహూ విద్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ఎన్నికల తీరును పర్యవేక్షిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయనను సన్నిహితులు ఛత్రపతి శంభాజీ నగర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో బీడ్ సెగ్మెంట్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. బీడ్‌లో షిండే ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు. అయితే ఎన్నికల టైంలో అభ్యర్థి మరణిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 52 ప్రకారం సంబంధిత సీటుపై ఓటింగ్‌ను వాయిదా వేయొచ్చు. కానీ ఈసీ దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కాగా, సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 58.22శాతం ఓటింగ్ నమోదైంది.

Advertisement

Next Story