Maharashtra teacher: పోర్న్ వీడియోలు చూపించి ఆరుగురు బాలికలపై వేధింపులు..!

by Shamantha N |
Maharashtra teacher:  పోర్న్ వీడియోలు చూపించి ఆరుగురు బాలికలపై వేధింపులు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఆరుగురు బాలికలను వేధించిన ఉపాధ్యాయుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. పోర్న్ వీడియోలు చూపించి ఆరుగురు బాలికలను నెలల తరబడి లైంగికంగా వేధించినందుకు ప్రభుత్వ టీచర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 47 ఏళ్ల ప్రమోద్ సర్దార్‌ పై విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఒకరు చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లోని టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఘటనపై అధికారులకు సమాచారం అందించారు. దీంతో, పాఠశాలకు వెళ్లిన అధికారులు విచారణ ప్రారంభించారు. టీచర్ ని అదుపులోకి తీసుకుని అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

నాలుగు నెలలుగా వేధింపులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత నాలుగు నెలలుగా విద్యార్థినులను టీచర్ వేధిస్తున్నాడు. వారికి పోర్న్ వీడియోలు చూపించి.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు మంగళవారం ఉదయం కూడా పాఠశాలను సందర్శించి మరికొంతమంది బాలికలతో మాట్లాడారు. దీనిపై, విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు ఆశా మిర్గే డిమాండ్ చేశారు. ఇకపోతే, ముంబై సమీపంలోని బద్లాపూర్ లోని పాఠశాలలో క్లీనింగ్ సిబ్బంది ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో, థానే వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఇలాంటి తరుణంలో ఆలాంటి మరో కేసు రావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed