సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం

by S Gopi |
సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: నిషేధిత సీపీఐ (మావోయిస్ట్)తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ సాయిబాబాపై ఆరోపణలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని పేర్కొంటూ ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న సాయిబాబా (54)కు విధించిన జీవిత ఖైదును కూడా హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో మరో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులపై ఆరోపణలను నిస్సందేహంగా నిరూపించలేకపోయిందని హైకోర్టు పేర్కొంది. శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌లో ఉన్న సాయిబాబా 2014లో ఈ కేసులో అరెస్టయినప్పటి నుంచి నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.

Advertisement

Next Story