రాష్ట్రాభివృద్ధి గురించి ప్రధాని మోడీతో చర్చించాను.. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే

by Javid Pasha |
రాష్ట్రాభివృద్ధి గురించి ప్రధాని మోడీతో చర్చించాను.. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రధాని మోడీతో చర్చించినట్లు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. శనివారం ఢిల్లీకి వచ్చిన ఆయన ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుటుంబంత సహా ప్రధాని మోడీని కలిశానని చెప్పారు. మ కోసం ప్రధాని చాలా సమయాన్ని వెచ్చించారని, అందుకు ఆయన ధన్యవాదాలు అని షిండే తెలిపారు.

వర్షాలు, రాయ్‌గఢ్‌ ఘటన, రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులు, ముంబైలో చేపట్టిన పలు ప్రాజెక్టుల గురించి ప్రధానికి వివరించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇళ్లు నిర్మాణానికి సంబంధించి ప్రధాని సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. పీఎం మోడీ, కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని సీఎం ఏక్ నాథ్ షిండే తెలిపారు.

Advertisement

Next Story