- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశ్వాస పరీక్షకు ‘మహా’ స్కెచ్.. తేజస్వి ఇంట్లో 79 మంది ఎమ్మెల్యేలు
దిశ, నేషనల్ బ్యూరో : జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ అండతో బిహార్‌లో ఇటీవల ఏర్పడిన ఎన్డీఏ సర్కారు సోమవారం ఉదయం రాష్ట్ర అసెంబ్లీ వేదికగా విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతోంది. ఈనేపథ్యంలో నితీశ్ ప్లేటు ఫిరాయింపుతో అధికారాన్ని కోల్పోయిన మహాగట్బంధన్ కూటమిలోని పార్టీలు తమ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీకి చెందిన 79 మంది ఎమ్మెల్యేలంతా రాష్ట్ర రాజధాని పాట్నాలోని తేజస్వి యాదవ్ నివాసానికి చేరుకున్నారు. వారందరికీ రెండు రోజుల బసకు సరిపడా ఏర్పాట్లను తేజస్వి చేశారు. సీపీఐ (ఎంఎల్) పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయన నివాసంలోనే మకాం వేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర బీజేపీ నాయకత్వం .. తేజస్వి యాదవ్ సొంత పార్టీ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయించే స్థాయికి దిగజారారని విమర్శించింది. ఇక బీజేపీ తమ ఎమ్మెల్యేలకు బోధ్ గయలో శని, ఆదివారాల్లో రెండు రోజుల రాజకీయ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి విశ్వాస పరీక్షతో సంబంధం లేదని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక బిహార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేల్లో 16 మందిని కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి పంపించారు. వారంతా ఆదివారం రాత్రికల్లా అక్కడి నుంచి పాట్నాకు చేరుకుంటారు. ఇక సోమవారం రోజున విశ్వాస పరీక్షకు తప్పకుండా హాజరుకావాలంటూ జేడీయూ పార్టీ తమ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసింది. విప్ ధిక్కరించేవారు అసెంబ్లీ సభ్యత్వం కోల్పోతారని స్పష్టం చేసింది.