Supreme Court: ఉత్తప్రదేశ్ లోని మదర్సాలకు బిగ్ రిలీఫ్

by Shamantha N |
Supreme Court: ఉత్తప్రదేశ్ లోని మదర్సాలకు బిగ్ రిలీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో వేల సంఖ్యలో ఉన్న మదర్సాలకు రిలీఫ్ దక్కింది. యూపీ మదర్సా ఎడ్యుకేషన్‌ చట్టంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేసింది. ఆ చట్టాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు(Supreme Court).. అది రాజ్యాంగబద్ధమేనని తీర్పిచ్చింది. కాగా.. ఇది రాజ్యంగ విరుద్దమంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఇకపోతే, ఉత్తరప్రదేశ్‌ మదర్సా చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ గతంలో అలహాబాద్‌ హైకోర్టు దానిని రద్దు చేసింది. ఈ తీర్పు 10వేల మదర్సా టీచర్లు, 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపైనా ప్రభావం చూపుతోందని పేర్కొంది. అయితే, అది లౌకికవాద భావనకు విరుద్ధమైనదని ఆ సందర్భంగా తెలిపింది. కాగా.. ఆ తీర్పుని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, మదర్సాలకు ఊరట దక్కింది. ప్రస్తుత తీర్పుతో 16వేల మదర్సాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed