Lovers:పార్క్‌లో గ్రామస్థులకు చిక్కిన లవర్స్..తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!?

by Jakkula Mamatha |   ( Updated:2024-08-22 08:56:16.0  )
Lovers:పార్క్‌లో గ్రామస్థులకు చిక్కిన లవర్స్..తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!?
X

దిశ,వెబ్‌డెస్క్:పార్క్‌లో రహస్యంగా కలుసుకోని కబుర్లు చెప్పుకుంటున్న ఓ ప్రేమ జంటకు బిగ్ షాక్ ఎదురైంది. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న ఓ ప్రేమజంట రహస్యంగా కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకుని వారిని చితకబాదారు. వివరాల్లోకి వెళితే..ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియాలో ఈ ఘటన జరిగింది. ఓకే గ్రామానికి చెందిన యువతి, యువకుడు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో అప్పుడప్పుడు కలుసుకోవడానికి గ్రామ శివారులోని పార్క్‌కి వెళ్తారంట. ఈ విధంగానే ముందస్తు ప్లాన్‌తో ఓ రోజు రాత్రివేళ రహస్యంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్లాన్ ప్రకారమే ఆ రోజు రాత్రి సమయాన ఇద్దరు పార్క్‌కు చేరుకున్నారు.

ఈ విషయం స్థానికుల చెవిన పడడంతో వీరిని అనుసరిస్తూ వారు కూడా పార్క్ వద్దకు బయలుదేరారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రేమ జంటను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదారు. అంతేకాదు వారిరువురి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రప్పించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. తర్వాత అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి తమ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి యువకుడి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఎంత ఒప్పించిన అంగీకరించకపోవడంతో అమ్మాయి తరఫున బంధువులు యువకుడిని అదుపులోకి తీసుకొని బంధించారు. పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటేనే అతడిని విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ రోజంతా కొనసాగింది. చివరికి పెళ్లికి అంగీకరించడంతో అతడిని విడిచిపెట్టారు.

Advertisement

Next Story