లవర్స్ డే.. రెంట్‌కు బాయ్ ఫ్రెండ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-14 02:57:17.0  )
లవర్స్ డే.. రెంట్‌కు బాయ్ ఫ్రెండ్
X

దిశ, వెబ్ డెస్క్: లవర్స్ డే సందర్భంగా ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. తన జీవితంలో తనకెదురైన అనుభవాల దృష్యా అద్దెకు బాయ్ ఫ్రెండ్ అంటూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. గురుగ్రామ్‌కు చెందిన 31 ఏళ్ల టెకీ షకుల్ గుప్తా వాలెంటైన్ డే సందర్భంగా బాయ్ ఫ్రెండ్ ఫర్ రెంట్ అంటూ ఒంటరి యువతులకు ఓ ఆఫర్ ప్రకటించాడు. పార్ట్ నర్ కోసం వెతికే యువతులకు తక్కువ ధరలకే బాయ్ ఫ్రెండ్‌ను అందిస్తానంటున్నాడు.

ఈ సందర్భంగా షకుల్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తాను ఇప్పుడు ఫేమస్ అయ్యానని తెలిపాడు. తాను ఈ వ్యాపారాన్ని వాణిజ్య కోణంలో లేదా ఫిజికల్ నేచూర్ కోణంలో చూడటం లేదన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బాయ్ ఫ్రెండ్ ఫర్ రెంట్ అనే పోస్టర్ చూపుతున్న ఫోటోనుద్దేశించి ఆయన కామెంట్ పెట్టాడు. ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కాన్సెప్ట్ ద్వారా 50 మంది మహిళలు తనతో టైం స్పెంట్ చేసినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా నెటిజన్లు పెట్టిన కామెంట్లకు షకుల్ స్మైల్ సింబల్ మాత్రమే రిప్లైగా ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి : ప్రేమికుల రోజు తస్మాత్ జాగ్రత్త!

Advertisement

Next Story