- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మాయి అనుకొని ప్రేమించాడు! స్కార్ఫ్ తీసి చూస్తే షాక్.. (వీడియో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ద్వారా ఎవరో తెలియకుండానే పరిచయాలు పెంచేసుకుని.. చివరకు మోసపోతున్నారు. అయితే ఇలాంటి సంఘటనే ఓ యువకుడి జీవితంలో జరిగింది. ఆ యువకుడికి అమ్మాయి పేరుతో సోషల్ మీడియాలో ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో అమ్మాయి అనుకొని వెంటనే యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత ఎంచక్కా ఇద్దరు తరచూ మెసేజ్ చేసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఈ అబ్బాయి లవ్ ప్రపోజల్ చేశాడు. దానికి ఆమె ఓకే చెప్పేసింది కూడా.
ఫోన్‌లో వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు అస్సలు ముఖం చూపించకపోయేదట. ఒకరోజు ఇద్దరు కలుసుకుందామని ప్లాన్ చేశారు. అతడిని మీట్ అవ్వడానికి వచ్చేటప్పుడు కూడా స్కర్ఫ్ కట్టుకొని వచ్చింది. ఆ యువకుడు ఎంత అడిగినా ఫేస్ చూపించకపోవడంతో బలవంతంగా ఆమె మోహంపై ఉన్న స్కార్ఫ్ లాగాడు. తీరా చూస్తే అబ్బాయి. ఇన్నాళ్లు నేను ప్రేమించింది ఓ అబ్బాయినా..? అంటూ షాక్ తిన్నాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇంకా తెలియరాలేదు. ‘ఘర్‌కే కలేష్’ అనే ఇన్‌స్టాగ్రాం అకౌంట్ ద్వారా పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.