కరెన్సీ నోట్లపై శ్రీరాముడి బొమ్మ.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!

by Shiva |   ( Updated:2024-01-16 15:43:27.0  )
కరెన్సీ నోట్లపై శ్రీరాముడి బొమ్మ.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరంలో ఈనెల 22న వైభవోపేతంగా శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో పాల్గొనున్నారు. అయితే అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ఇవాళ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.500ల కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ స్థానంలో శ్రీరాముడి చిత్రాన్ని ముద్రించినట్లుగా ఓ నోటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఆ నోటుపై ఎర్రకోట స్తానంలో అయోధ్య రామ మందిరం, స్వచ్ఛ భారత్ లోగో స్థానంలో రామబాణం ముద్రించినట్లుగా ఉంది. కానీ, కొత్త నోటు ముద్రించడంపై ఆర్బీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 1996లో కరెన్సీ నోట్లపై అశోకుడి స్థూపం స్థానంలో మహాత్మా గాంధీ సిరీస్‌ను ఆర్బీఐ ప్రచురించడం ప్రారంభించింది. అప్పటి నుంచి భారత కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రమే ఉండిపోయింది. ఈ విషయంలో ఆర్బీఐని సంప్రదించగా అలాంటిదేమి కోట్టిపడేసింది.

Advertisement

Next Story