MK Stalin: డీఎంకే పతనం గురించే మాట్లాడుతున్నారు.. విజయ్ పై స్టాలిన్ ఫైర్

by Shamantha N |
MK Stalin: డీఎంకే పతనం గురించే మాట్లాడుతున్నారు.. విజయ్ పై స్టాలిన్  ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: నటుడు విజయ్‌ దళపతి (Actor Vijay)పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేదన్న తమిళగ వెట్రి కళగం ( Tamilaga Vetri Kazhagam) పార్టీ ఆరోపణలపై స్పందించారు. ఎన్నికల హామీలను చాలా వరకూ నెరవేర్చినట్లు స్పష్టం చేశారు. ‘మా ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదని కొందరు వాదిస్తున్నారు. మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. మిగిలినవి ఒకటి లేదా రెండు త్వరలోనే అమలు చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో విజయ్‌పై స్టాలిన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘కొత్త పార్టీలను ప్రారంభించే వారంతా డీఎంకే పతనం గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి మాకు ఆందోళన లేదు. విమర్శలను మేం పట్టించుకోం. అన్ని ఆరోపణలకు జవాబిచ్చి మా సమాయన్ని వృథా చేసుకోవాలనుకోవడం లేదు. ప్రజల ప్రయోజనం కోసం పనిచేయడమే మా పని. నాలుగేళ్ల ప్రభుత్వ విజయాల గురించి ఆలోచించాలని వారికి నేను వినమ్రంగా చెప్పాలనుకుంటున్నా’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు.

టీవీకే తీర్మానాలు

విజయ్ కు చెందిన తమిళగ వెట్రి కళగం ( Tamilaga Vetri Kazhagam) పార్టీ ఆదివారం పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో 26 తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యంగా ‘వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌’, నీట్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే సమయంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వంపై విజయ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్టాలిన్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో అబద్ధాలతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. అయితే,ఆ వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్‌ (MK Stalin) ఇలా స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed