- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ అభ్యర్థుల జాబితా రివైజ్.. ఎందుకు ?
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : అసోం రాష్ట్రానికి సంబంధించిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాను బీజేపీ సవరించింది. అభ్యర్థుల పేర్లు ఏవైనా మారాయని అనుకుంటున్నారా ? అలాంటిదేం జరగలేదు !! కేవలం లోక్‌సభ నియోజకవర్గాల పేర్లు మాత్రమే మారాయి. అభ్యర్థుల పేర్లు యథాతథంగా ఉన్నాయి. అసలేం జరిగిందంటే.. ఇటీవల అసోంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) జరిగింది. కానీ శనివారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో డీలిమిటేషన్‌కు మునుపటి లోక్‌సభ నియోజకవర్గాల పేర్లను ప్రస్తావించారు. ఈ తప్పిదాన్ని గుర్తించిన పార్టీ నాయకత్వం వెంటనే ఆయా స్థానాల పేర్లను సవరించి అసోం రాష్ట్ర అభ్యర్థుల పేర్లతో మరో జాబితాను విడుదల చేసింది. అసోంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలకుగానూ 11 సీట్లకు అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది.
Advertisement
Next Story