‘నాలుగో విడత’ బరిలో దిగ్గజ నేతలు.. ఎవరో తెలుసా ?

by Hajipasha |
‘నాలుగో విడత’ బరిలో దిగ్గజ నేతలు.. ఎవరో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల ఘట్టంలోని మొత్తం ఏడు విడతలకుగానూ ఇప్పటికే మూడు విడతలు పూర్తయ్యాయి. తదుపరిగా నాలుగో విడత పోలింగ్ మే 13న జరగబోతోంది. ఆ రోజున ఏపీ, తెలంగాణ సహా మొత్తం 9 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని 96 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల పండుగ జరగనుంది. ఈ దశలోనే ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 స్థానాలు, తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. వీటితో పాటు ఉత్తరప్రదేశ్‌లోని 13, మహారాష్ట్రలోని 11, పశ్చిమ బెంగాల్‌లోని 8, మధ్యప్రదేశ్‌లోని 8, బిహార్‌లోని 5, జార్ఖండ్, ఒడిశాలలోని 4, జమ్మూ కాశ్మీర్‌లోని ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది.

‘నాలుగో విడత’ బరిలో ప్రముఖులు వీరే..

* ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు.

* బెంగాల్‌లోని కృష్ణానగర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి అమృతా రాయ్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మహువా మొయిత్రా పోటీ చేస్తున్నారు.

* పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్‌లో టీఎంసీ అభ్యర్థి, భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ స్థానం నుంచి నిర్మల్‌కుమార్‌ను బీజేపీ పోటీకి దింపింది.

* కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ బిహార్‌లోని బెగుసరాయ్ నుంచి పోటీ చేస్తున్నారు.

* కేంద్ర మంత్రి, జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా ఖుంతీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

* శత్రుఘ్న సిన్హా పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నుంచి టీఎంసీ తరఫున పోటీ చేస్తున్నారు.

Advertisement

Next Story