- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీహార్ జైల్లో ‘లిక్కర్’ దోస్తులు ఒక్కటైయ్యారు!
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో మద్యం తయారీ దారులు, హోల్ సేల్ వ్యాపారులు, రిటైల్ దుకాణాలకు మేలు జరిగేలా కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యవహరించిందనే ఆరోపణ ఉంది. ఈ క్రమంలోనే రూ. 100 కోట్ల మేర ముడుపులు తీసుకున్నారని ఈడీ అంటోంది. ఈ వ్యవహారంలో ఆప్ నేతలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితల కీలక పాత్ర ఉందని లిక్కర్ స్కాంలో కీలక పాత్ర ఉందని ఈడీ ఆరోపిస్తున్నది. ఈ క్రమంలోనే వీరికి ఈడీ ఎన్నో సార్లు నోటీసులు పంపింది. ముందుగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా లిక్కర్ స్కాం చర్చానీయాంశంగా మారింది.
లిక్కర్ స్కామ్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. ‘లిక్కర్ క్వీన్ వెల్‌కమ్స్ లిక్కర్ కింగ్’ అని సోషల్ మీడియాలో ఆకతాయిలు మీమ్స్ క్రియేట్ చేశారు. అల్రెడీ అరెస్ట్ అయిన కవిత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను బోట్టు పెట్టి జైల్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఓ వీడియో సమాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. లిక్కర్ స్కాం దోస్తులంతా తీహార్ జైల్లో ఒక్కచోట చేరారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా వీరికి తోడుగా వస్తారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.