- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిక్కర్ కేసు: కాసేపట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్?
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. గురువారం సాయంత్రం నుంచి 12 మంది ఈడీ అధికారుల బృందంతో జాయింట్ డైరెక్టర్ జోగేందర్ కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తనిఖీల అనంతరం సీఎంను అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. అటు నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించనున్నట్లు సమాచారం. కాగా, ఇవాళ ఉదయం ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసు పురోగతి దృష్ట్యా తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. మరోవైపు.. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఎమ్మెల్యే కవిత ప్రస్తుతం ఢిల్లీలోని ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల వేళ ఈ పరిణామాలు దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.