బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న అధికారిక ప్రకటన

by GSrikanth |
బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న అధికారిక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వీరశైవ లింగాయత్ కమ్యూనిటీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు కర్ణాటక వీరశైవ లింగాయత్ ఫోరమ్ కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతూ అధికారిక లేఖను అదివారం విడుదల చేసింది. లింగాయత్ కమ్యూనిటీ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ఫోరం కోరింది. కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపే వర్గాల్లో మొదటి వరుసలో ఉండే కమ్యూనిటీ లింగాయత్ కమ్యూనిటీ. 1956లో ఆ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సమూహం. వీరి ఓటు ఎంతో ప్రముఖ్యమైంది.

అయితే వీరు ఇన్ని రోజులు ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది.. ఎవరికి స్పష్టత లేకుండా పోయింది. వీరు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టికి మద్దతు ఇస్తున్న కూడా.. ఈసారి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని అందరూ అనుకున్నారు. మరోవైపు బీజేపీతో కూడా వీరు కలవడానికి సుముకంగా లేరనే వార్తలు వినిపించాయి. కానీ అనూహ్యంగా లింగాయత్ కమ్యూనిటీ ఈ ప్రకటన విడుదల చేయడంతో ఆశ పెంచుకున్న బీజేపీకి షాక్ ఇచ్చారు. మరి ఈ ప్రకటనతో కర్ణాటక ఎన్నికల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వేచి చూడాలి.

Advertisement

Next Story