Rahul Gandhi : ద్వేషపూరిత రాజకీయాలకు దూరంగా ఉందాం.. రాహుల్ గాంధీ

by M.Rajitha |   ( Updated:2024-11-03 13:28:17.0  )
Rahul Gandhi : ద్వేషపూరిత రాజకీయాలకు దూరంగా ఉందాం.. రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్ : వయనాడ్(Wayanad) లోక్ సభకు జరుగుతున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె సోదరుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. వయనాడ్ లో జరుగుతున్న ఎన్నిక ప్రేమ, ద్వేషానికి మధ్య జరుగుతున్న పోరాటమని పేర్కొన్నారు. తమ తండ్రిని హత్య చేసిన నళిని(Nalini)ని ప్రియాంక హత్తుకున్నదని, తన పట్ల జాలి కలుగుతోందని తెలిపినట్టు రాహుల్ తెలిపారు. తమకు అందరి మీద ప్రేమ ఉందని, ఎవ్వరినీ మేము ద్వేషించలేమని, అందుకు ఈ సంఘటనే ఉదాహరణ అని అన్నారు. రాజ్యాంగాన్ని కోపంతో, ద్వేషంతో రాయలేదని.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎంతోమంది ఈ దేశం మీద ప్రేమతో రాశారని వెల్లడించారు. కాబట్టి మనకు కావాల్సింది ద్వేషంతో నిండిన రాజకీయాలు కాదని, ఆప్యాయతతో కూడిన రాజకీయాలు ప్రస్తుతం దేశానికి అవసరం అని రాహుల్ తెలియ జేశారు.

Advertisement

Next Story

Most Viewed