- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలి: సుప్రీంకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆశ్రయించిన సందర్భాలపై సుప్రీంకోర్టు సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. పోటీ పడకుండా ఇరుపక్షాలు పరస్పరం సహకారం అందించుకోవాలని సూచించింది. కరువు సహాయ నిధుల పంపిణీలో జాప్యంపై కర్నాటక ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. 'కేంద్రం, రాష్ట్రాల మధ్య పోటీ ఉండకూడదని ' అని పేర్కొంది. అనేక జిల్లాల్లో కరువు దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక సహాయం అందించలేదని, నిధుల పంపిణీలో వైఫల్యం దక్షిణాది ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినందున కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రివర్గ బృందం నివేదిక సమర్పించి ఐదు నెలలు గడుస్తున్నా కేంద్రం నిధులు విడుదల చేయలేదని ఆరోపించింది. ఎన్‌డీఆర్ఎఫ్(జాతీయ విపత్తు) ప్రయోజనాలు నిలిపేయడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని రాష్ట్రం వెల్లడించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలకు రెండు వారాల గడువు ఇచ్చింది.
కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య లోక్‌సభ ఎన్నికల వేల వివాదం ముదురుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కేరళలు నిధుల పంపిణీ, పన్నుల పంపిణీపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. వరదలతో దెబ్బతిన్న జిల్లాలకు మధ్యంతర సహాయ ప్యాకేజీలో భాగంగా రూ. 2,000 కోట్లను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమస్యపై ఫిబ్రవరిలో పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ అధిత్ రంజన్ చౌదరి మధ్య తీవ్ర చర్చలు జరిగాయి. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే బకాయిలు, కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని వారు ఆరోపించారు. దీనిపై నిర్మలా సీతారామన్, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు మేరకే పన్నుల పంపిణీ జరుగుతోందన్నారు.