- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Syria Crisis: భారతపౌరులు సిరియాను వెంటనే వీడాలి.. అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం
దిశ, నేషనల్ బ్యూరో: సిరియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. తిరుగుబాటుదారులు ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తున్నారు. దీంతో, ప్రభుత్వ దళాలు కూడా నిస్సహాయస్థితిలో మిగిలిపోయాయి. కాగా.. ఇలాంటి పరిణామాల మధ్య భారత విదేశాంగ శాఖ (MEA Advisory) కీలక ప్రకటన చేసింది. భారత పౌరులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని అడ్వైజరీ జారీ చేసింది. ‘‘సిరియా (Syria)లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులెవరూ తదుపరి నోటిఫికేషన్ జారీ చేసేవరకు ఆ దేశానికి వెళ్లొద్దని సూచిస్తున్నాం. ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాలను వాడుకుని వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలి. అత్యవసర పరిస్థితుల్లో డమాస్కస్‌లోని ఇండియన్ ఎంబసీతో టచ్‌లో ఉండాలి. అత్యవసర సహాయం కోసం +963993385973, [email protected]ను సంప్రదించాలి. దాదాపు దశాబ్దం పాటు ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి’’ అని కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు
సిరియాలో తిరుగుబాటు..
ఇకపోతే, సిరియాలో తిరుగుబాటుదారులు మళ్లీ రెచ్చిపోయారు. బషర్ అల్-అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ దళాల్ని వెనక్కినెడుతూ.. రెబల్స్ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక పట్టాణాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఇక తిరుగుబాటుదారుల తదుపరి లక్ష్యం రాజధాని డమాస్కస్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నగరాన్ని కూడా ఆక్రమిస్తే సిరియా పూర్తిగా రెబల్స్ చేతుల్లోకి వెళ్లిపోతుంది.