- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anmol Bishnoi : లారెన్స్ బిష్ణోయ్ సోదరుడి అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ (Baba Siddhikhi) హత్య తమ పనిగా ప్రకటించిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) గురించి తెలిసిందే. కాగా సోమవారం లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్(Anmol Bishnoi)ను అమెరికాలోని కాలిఫోర్నియా(California)లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా(Punjabi singer Sidhu Moosewala) హత్య కేసులో అన్మోల్ ప్రధాన నిందితుడు. మరిన్ని హింసాత్మక నేరాలలో ప్రమేయం ఉన్నందున అన్మోల్ బిష్ణోయ్‌పై రెండు వారాల క్రితం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడింది. కాగా ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ అరెస్టును ధృవీకరించగా.. ముంబై, ఢిల్లీ పోలీసులు మాత్రం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సిద్ధూ హత్య అనంతరం నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుండి పారిపోయిన బిష్ణోయ్ కెనడా(Canada)లో ఆశ్రయం పొందినట్లు భావిస్తున్నారు.