- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Swiggy సరికొత్త రికార్డ్.. నిన్న ఒక్కరోజే అత్యధికంగా Condoms Deliveries
దిశ, డైనమిక్ బ్యూరో: న్యూఇయర్ వేళ సరికొత్త రికార్డులు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఏడాది వీకెండ్ కావడంతో జనాలు శనివారం మధ్యాహ్నం నుంచే న్యూఇయర్ వేడుకలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కేకులు బీర్లతో పాటు బిర్యాణీలు, చిప్స్ పాకెట్స్, పిజ్జాలు ఇలా రకరకాల ఫుడ్ వెరైటీస్ అత్యధికంగా కొనుగోలు జరిగింది. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ శనివారం ఒక్కరోజే 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్‌లను డెలివరీ చేసి రికార్డు సృష్టించింది. రాత్రి 10.25 గంటల సమయానికి స్విగ్గీ యాప్ దేశ వ్యాప్తంగా 61,000 పిజ్జాలను డెలివరీ చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. స్విగ్గీ సంస్థ ట్విట్టర్ వేదికగా నిర్వహించిన ఓ పోల్ ప్రకారం.. హైదరాబాదీ బిర్యానీకి 75.4 శాతం ఆర్డర్లు వచ్చాయని, లక్నోలో-14.2 శాతం, కోల్‌కతా -లో10.4 శాతం ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది. కాగా, ఒక్క రోజులోనే 3.50 లక్షల ఆర్డర్లను డెలివరీ చేసిన ఫుడ్ డెలివరీ యాప్‌గా స్విగ్గీ అగ్రస్థానంలో నిలిచింది. కాగా, హైదరాబాద్‌లో అత్యధికంగా బిర్యానీ అమ్ముడవుతున్న రెస్టారెంట్‌లలో ఒకటైన బావర్చి, 2023 కొత్త సంవత్సరం సందర్భంగా నిమిషానికి రెండు బిర్యానీలను డెలివరీ చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 31, 2022 నాటికి 15 టన్నుల రుచికరమైన వంటకాలను సిద్ధం చేసింది. ఇక, డోమినోస్ 61,287 పిజ్జాలను డెలివరీ చేసినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఎన్ని ఒరేగానో ప్యాకెట్లు అమ్ముడవుతున్నాయో ఊహించవచ్చని స్విగ్గీ ట్వీట్ చేసింది. ఇక శనివారం రాత్రి 7 గంటల సమయానికి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో 1.76 లక్షల చిప్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేసినట్లు కూడా తెలిపింది. ఇదిలా ఉండగా దేశం మొత్తం మీద దాదాపు 12,344 మంది కొత్త సంవత్సరం సందర్భంగా రాత్రి 9.18 గంటల వరకు కిచిడీని ఆర్డర్ చేసినట్టు సమాచారం. మరోవైపు స్విగ్గి ఇన్‌స్టా మార్ట్‌లో కండోమ్స్ ను కూడా అత్యధికంగా ఆర్డర్ చేశారని...కేవలం 2.5 నిమిషాల్లో స్విగ్గీ సంస్థ డెలివరీ చేసినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
ఇవి కూడా చదవండి : సెక్స్ చాటింగ్‌తో నెలకు లక్షల్లో సంపాదిస్తున్న భార్య.. విషయం తెలిసి భర్త చేసిన నీచపు పని ఇదే!