Lalu prasad yadav: బిహార్ ప్రజలను నితీశ్ మోసం చేశారు..లాలూ ప్రసాద్ యాదవ్

by vinod kumar |
Lalu prasad yadav: బిహార్ ప్రజలను నితీశ్ మోసం చేశారు..లాలూ ప్రసాద్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్‌ విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో నితీశ్ బిహార్ ప్రజలను మోసం చేశారన్నారు. పాట్నా విమానాశ్రయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటననే నితీశ్ పునరావృతం చేస్తున్నాడని, ఆయనకు సొంత అభిప్రాయం ఏ మాత్రం లేదన్నారు. నితీశ్ బీజేపీకి లొంగిపోయారని ఆరోపించారు. అధికారం కోసం బిహార్ ఆకాంక్షలను తాకట్టు పెట్టాడన్నారు. స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని హామీ ఇచ్చి దానిని విస్మరించారన్నారు. ప్రత్యేక కేటగిరీ హోదా రాకుండా బిహార్ అభివృద్ధి జరగదని ఇప్పటికే స్పష్టంగా అర్థమైందన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో పేదలకు, రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. కాగా, బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశం తమ ప్రతిపాదనలో లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story