హనుమాన్ విగ్రహం ముందు పోజులిచ్చిన లేడి బాడీబిల్డర్స్.. బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్

by Mahesh |
హనుమాన్ విగ్రహం ముందు పోజులిచ్చిన లేడి బాడీబిల్డర్స్.. బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్
X

దిశ, వెబ్‌డెస్క్: హనుమంతుడి ఫోటో ముందు మహిళా బాడీబిల్డర్లు పోజులిచ్చిన వీడియో పై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగుతుంది. కాగా మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో 13వ మిస్టర్ జూనియర్ బాడీబిల్డింగ్ పోటీ మార్చి 4, 5 తేదీల్లో బీజేపీ ఈ పోటీలను నర్వహించింది. కాగా ఈ పోటీల్లో భాగంగా లేడీ బాడీబిల్డర్లు హనుమంతుని చిత్రం ముందు పోజులిచ్చారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నాయకులు పోటీలు నిర్వహించిన ప్రదేశానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి హనుమాన్ చాలీసా చదివారు. ఆదివారం ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం హిందువులను, హనుమంతుడిని అగౌరవ పరిచిందని ఆరోపిస్తూ.. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను క్షమాపణలు చెప్పాలని ఎంపీ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ మీడియా సలహాదారు పీయూష్ బాబెలే కోరారు.

కాంగ్రెస్ పై బీజేపీ ఎదురుదాడి..

మహిళలు క్రీడల్లో రాణించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి హితేష్ బాజ్‌పాయ్ కాంగ్రెస్ పై ఎదురు దాడికి దిగారు. అయితే కొంతమంది ఈవెంట్ నిర్వాహకులు కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. పోలీసులకు మెమోరాండం సమర్పించారు. బాజ్‌పాయ్ తన వీడియో ప్రకటనలో, “కాంగ్రెస్‌వారు మహిళలు రెజ్లింగ్, జిమ్నాస్టిక్స్ లేదా స్విమ్మింగ్‌లో పాల్గొనడాన్ని చూడలేరు, ఎందుకంటే వారిలోని దెయ్యం దీనిని చూసి మేల్కొంటుంది. ఆట స్థలంలో ఆడవాళ్లను మురికి కళ్లతో చూస్తున్నారు. వారికి సిగ్గు లేదా?" అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed