సూపర్ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులు తొలగింపు.. వీడియో వైరల్

by Manoj |
సూపర్ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులు తొలగింపు.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: మహమ్మద్ ప్రవక్తపై మాజీ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అందుకు నిరసనగా కువైట్‌లోని సూపర్ మార్కెట్లు తీసుకున్న నిర్ణయం అందరికి అందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం సూపర్ మార్కెట్లలో ఉండే భారతీయ ఉత్పత్తులను వారి షెల్ఫ్‌ల నుంచి తొలగించాయి. అయితే ప్రముఖ అల్-అర్దియా కో-ఆపరేటివ్ సొసైటీ స్టోర్‌లోని కార్మికులు షెల్ఫ్‌లపై వరుసలో ఉన్న ఉత్పత్తులను కవర్ చేయడం లేదా తీసివేయడం చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. "మేము, కువైట్ ముస్లిం ప్రజలుగా, ప్రవక్తను అవమానించడాన్ని అంగీకరించము" అని స్టోర్ యొక్క CEO నాసర్ అల్-ముతైరి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed