బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కుమారస్వామి క్లారిటీ!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-07 11:48:19.0  )
బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కుమారస్వామి క్లారిటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కాగా ఈ అంశంపై ఆయన స్పందించారు. కర్ణాటకలో బీజేపీకి అధికారం ఇస్తే పేష్వా సంబంధాలు కలిగిన బ్రాహ్మణ సీఎం అయ్యే అవకాశం ఉందని మాత్రమే తాను చెప్పానని వివరణ ఇచ్చారు. తాను ఎవరిని కించపరచలేదన్నారు. మరాఠీ పేష్వా డీఎన్ఏ కలిగిన ఒక నిర్దిష్ట నేత గురించి మాత్రమే తాను కామెంట్ చేశానని దీన్ని వివాదాస్పదం చేయడం బాధకరమన్నారు. బ్రాహ్మణులు సర్వేజనా సుఖినోభవంతు అనే లక్ష్యంతో ఉంటారని అయితే పేష్వా బ్రాహ్మణులు ఇందుకు విరుద్ధమన్నారు.

తాను చేసిన ప్రకటన బ్రాహ్మణ కులానికి వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్ర మూలాలు కలిగిన వ్యక్తి సీఎం అయితే ఎవరికి అభ్యంతరం లేదన్నారు. మరాఠా మూలాలు ఉన్న బ్రాహ్మణ నేత సీఎం అయ్యే అవకాశం ఉందని తాను చేసిన వ్యాఖ్యలతో ఆ వర్గాన్ని తనపై ఉసిగొల్పే ప్రయత్నం చేశారన్నారు. ఇదే అంశంపై స్పందించిన కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై రాజకీయాల్లో కులమతాలు అప్రస్తుతమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా సీఎం కావచ్చని తెలిపారు.

Read More: BJP పార్లమెంటరీ పార్టీ సమావేశం.. హాజరైన ప్రధాని

Advertisement

Next Story

Most Viewed