- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Delhi: కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కేటీఆర్ భేటీ
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).. కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్(Manohar Lal Khattar)తో భేటీ అయ్యారు. అమృత్ పథకం(AMRUT scheme)లో జరిగిన అక్రమాలపై ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేంద్రమంత్రికి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకున్నా టెండర్లు కట్టబెట్టారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే పథకంలో అక్రమాలు జరిగాయని కేటీఆర్ పలుమార్లు ఆరోపించారు. ఆధారాలు సైతం ఉన్నాయని మీడియా ఎదుట చెప్పారు. మీడియా సమావేశంలో చూపించిన ఆధారాలతో పాటు తన దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆధారాలను కేంద్ర మంత్రికి ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చే అమృత్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని.. వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం.