Kolkata rape case: వైద్యుల భద్రతకు కేంద్ర రక్షణ చట్టాన్ని అమలు చేయాలి.. ఎయిమ్స్ డాక్టర్ల డిమాండ్

by vinod kumar |
Kolkata rape case: వైద్యుల భద్రతకు కేంద్ర రక్షణ చట్టాన్ని అమలు చేయాలి.. ఎయిమ్స్ డాక్టర్ల డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే వైద్యుల భద్రతకు కేంద్ర రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ఆల్ ఇండియా ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు, వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం వెంటనే తమకు హామీ ఇవ్వాలని కోరుతున్నారు. లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ వైద్యుడు కుమార్ కార్తికే మాట్లాడుతూ..ఈ విషయంలో కేంద్ర వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రాత పూర్వక హామీ లభించే వరకు నిరసనలు కొనసాగిస్తామన్నారు. తాజా ఘటనపై పారదర్శక విచారణ కోరుకుంటున్నామని తెలిపారు. బాధిత కుటుంబానికి పరిహారం అందించాలని, ఆరోగ్య కార్యకర్తలందరి భద్రత కోసం రక్షణ చట్టాన్ని తీసుకురావాలన్నారు. మరోవైపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఆస్పత్రుల వద్ద భద్రత విమానాశ్రయాల కంటే తక్కువగా ఉండకూదడని తెలిపింది. ఆస్పత్రుల వద్ద సీసీటీవీల ఏర్పాటు, భద్రతను మోహరించాలని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed